Anupama: మలయాళ నటి అనుపమ పరమేశ్వరన్ సినిమా ఇండస్ట్రీలో దశాబ్ద కెరీర్ పూర్తి చేసుకుంది. ప్రేమమ్‌తో ఎంట్రీ ఇచ్చి తెలుగు, తమిళ్ ఇండస్ట్రీల్లో స్టార్‌గా నిలిచింది. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. తాజాగా పెళ్లి విషయంలో ఓపెన్ అయింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Daggubati Rana: దగ్గుబాటి కుటుంబంలో సంబరాలు.. తండ్రి కాబోతున్న రానా ?
2015లో మలయాళ చిత్రం ప్రేమమ్‌తో ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ దశాబ్ద కెరీర్ పూర్తి చేసుకుంది. తక్కువ కాలంలోనే తమిళ్లో కోడి, సిరెన్, తెలుగులో అ ఆ, శతమానం భవతి, టిల్లు స్క్వేర్ చిత్రాలతో కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. శతమానం భవతి సూపర్‌హిట్‌తో స్టార్డమ్ సాధించింది. దక్షిణాది మూడు భాషల్లో నటిస్తూ బిజీ నటిగా మారింది. ఆకర్షణీయ అందం, అభినయంతో క్రేజీ ఆఫర్లు అందుకుంటోంది. ఇటీవల పరదా చిత్రం కమర్షియల్‌గా నిరాశ పరిచినా క్రేజ్ తగ్గలేదు. కిష్కిందపురి, బైసన్ సినిమాలతో హిట్లు కొట్టింది. ప్రస్తుతం చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. షూటింగ్‌లు, చర్చలు జరుగుతున్నాయి. అయితే అనుపమ ఈమధ్య పెళ్లి ప్రశ్నలు ఎదుర్కొంటోంది. గతంలో ఆమె ప్రేమ వార్తలు పుకార్లుగా మిగిలాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రేమ వివాహమే చేసుకుంటానని ఓపెన్ అయింది. అది కూడా కుటుంబ సభ్యులను ఒప్పించిన తర్వాతే అని క్లారిటీ ఇచ్చింది.

