Nithin Robin Hood

Nithin Robin Hood: నితిన్ ‘రాబిన్ హుడ్’ రిలీజ్ మళ్ళీ మారనుందా!?

Nithin Robin Hood: నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న చిత్రం ‘రాబిన్ హుడ్’. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను నవంబర్ 14 రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు దర్శకనిర్మాతలు. అయితే ఈ పోస్టర్ లో రిలీజ్ డేట్ ను ప్రకటించకపోవడంతో మరోసారి ‘రాబిన్ హుడ్’ రిలీజ్ వాయిదా పడుతుందనే న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. నిజానికి ‘గేమ్ ఛేంజర్’ క్రిస్మస్ నుంచి సంక్రాంతికి వెళ్ళిన నేపథ్యంలో ‘రాబిన్ హుడ్’ డిసెంబర్ 20న రిలీజ్ అవుతుందన్నారు. ఇప్పుడు టీజర్ పోస్టర్ పై డేట్ లేకపోవడంతో రిలీజ్ డేట్ మారుతుందని స్పష్టం అయింది. మరి కొత్త తేదీని 14న రిలీజ్ చేసే టీజర్ లోనైనా స్పష్టం చేస్తారో? లేదో? ఇక ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ కీలక పాత్రధారులు. ఈ మధ్య వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న నితిన్ కి ‘రాబిన్ హుడ్’తో మళ్లీ సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  GV Prakash: హీరోయిన్ తో ఎఫైర్ పై స్పందించిన జీవీ ప్రకాష్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *