Hyderabad: రాజేంద్రనగర్‌లో మరో కీచక టీచర్ బాగోతం బట్టబయలైంది. విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పించాల్సిన టీచర్.. కామంతో కళ్లు మూసుకుపోయి వికృత ఆనందం పొందాడు. ప్రశ్నించిన ప్రధానోపాద్యాయురాలితో గొడవ పడ్డాడు. తానే తోపంటూ విర్రవీగాడు. వెంటనే ఎంఈవోకు కంప్లీట్ చేయగా.. ఆయన స్పందించి సరైన గుణపాఠం చెప్పాడు. బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో దివ్యాంగుడైన ఫిజిక్స్ టీచర్ బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది.
స్పెషల్ క్లాస్ పేర్లతో విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. పదో తరగతి బాలికలకు మాత్రమే పాఠాలు చెబుతానంటూ వికృత ఆనందం పొందాడు. అదే సమయంలో విద్యార్థినిల ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు.సాయంత్రం స్కూల్ ముగిసినప్పటికి బాలికలను ఇంటికి కూడా పంపించేవాడు కాదు. ఇక అతడి లైంగిక వేధింపులతో భయబ్రాంతులకు గురైన విద్యార్థులు.. తమపై జరుగుతున్న లైంగిక దాడిని ప్రధానోపాధ్యాయురాలికి చెప్పుకున్నారు. ఆమె వెంటనే వేణుగోపాల్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేయగా వాగ్వాదం పెట్టుకున్నాడు. దీంతో చేసేదేమి లేక ప్రధానోపాధ్యాయురాలు పాఠశాల బయట నిరసన వ్యక్తం చేశారు.
Hyderabad: ఇక ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పాఠశాల వద్దకు చేరుకుని ఆమెకు మద్దతుగా నిలిచారు. అనంతరం ఎంఈవోకు ఫిర్యదు చేశారు. దీంతోపాటు ముదిరాజ్ కార్పొరేషన్ ఛైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ విషయం తెలుసుకుని వెంటనే పాఠశాలకు చేరుకున్నాడు. ఆపై వేణుగోపాల్ రావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పందించిన ఎంఈవో శంకర్ నాయక్.. వేణుగోపాల్ రావును విధుల నుంచి సస్పెండ్ చేశారు.