Life Style: ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతీ ఒక్కరిది బిజీ లైఫ్. కనీసం వారి ఆరోగ్యాన్ని పట్టించుకునే టైమ్ కూడా కొంతమందికి ఉండడం లేదు. అధిక ఒత్తిడితో ఎంతో మంది సతమతమవుతున్నారు. అయితే చిన్న చిన్న మార్చులతో ఒత్తిడి జయించి ప్రశాంతమైన జీవితాన్ని గడపొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ధ్యానంతో ప్రారంభించండి
Life Style: అధిక ఒత్తిడి సమయంలో ధ్యానం మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. శ్వాస వ్యాయామాలు మానసికంగా దృఢంగా చేస్తాయి. కాబట్టి రోజు ధ్యానం చేయాలి.
మార్నింగ్ డైరీ
Life Style: కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లతో ఉదయం దినచర్యను ప్రారంభించాలి. 30 నిమిషాల మౌనం, ధ్యానంతో రోజును ప్రారంభిస్తే రోజంతా ప్రశాంతంగా ఉంటారు. యోగా, మార్నింగ్ వాక్ చేసినా బెటర్ గా అనిపిస్తుంది.
ఇది కూడా చదవండి: Sabarimala: శబరిమల మండల కాల దర్శనాల ముగింపు ఈరోజు
వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వండి
Life Style: వ్యాయామం అనేది శరీరానికే కాదు మనసుకు కూడా ఆరోగ్యకరమైనది. కూర్చోవడం కంటే నడవడం లేదా వాకింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. మెదడు ఆరోగ్యానికి వ్యాయామం చాలా అవసరం. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంతో పాటు ఆలోచనా శక్తిని పదును పెడుతుంది. ఇతరుల మనోభావాలను దెబ్బతీయకూడదని మనపై మనం చాలా ఒత్తిడి తెచ్చుకుంటాం. చాలా మంది ఇతరుల అవసరాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతూ.. ఆరోగ్యాన్ని పట్టించుకోరు. వీలయినంత వరకు వద్దు, కుదరదు, కాదు అనేదానికి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోండి. మీ ఇష్టాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి.
ప్రకృతితో సమయం
Life Style: ప్రకృతికి వైద్యం చేసే శక్తి ఉందని అంటారు. ప్రకృతితో సమయం గడపడం వల్ల బాధలు, ఒత్తిడి అన్నీ దూరమవుతాయి. ఉదయం సూర్యకిరణాలను ఆస్వాదించాలి. చిన్నపాటి మార్నింగ్ వాక్ తో ప్రకృతితో సమయాన్ని గడపండి.జీవితంలో వచ్చే చిన్న చిన్న విషయాలను ఆస్వాదించండి మరియు ఆనందించండి. పక్షుల కిలకిలారావాలైనా, పిల్లల ఏడుపులైనా, కుటుంబంతో గడిపిన క్షణాలైనా, అన్నింటినీ ఆస్వాదించండి.
డిజిటల్ పరికరాలకు దూరం
Life Style: వీలైనంత వరకు ఫోన్, సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించాలి. ఫోన్ వాడటానికి ఒక టైమ్ పెట్టుకోవాలి. మిగితా సమయాల్లో ఫోన్ వాడొద్దు. ఎక్కువగా కుటుంబసభ్యులతో సమయాన్ని గడపాలి.ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం. ఆహారంలో ఎక్కువ కూరగాయలు, పండ్లు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్, షుగర్ ఫుడ్స్, కెఫీన్‌ని వీలైనంత వరకు తగ్గించాలి.
నిద్రకు ప్రాధాన్యత
Life Style: మీరు ఎంత ఒత్తిడికి లోనైనప్పటికీ ఆరోగ్యకరమైన నిద్ర అనేది చాలా అవసరం. మంచి నిద్ర మానసిక స్థితిని మెరుగుపరిచి..జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. నిద్ర లేకపోవడం వల్ల మరింత చిరాకు, నిరాశ, ఏకాగ్రత దెబ్బతింటుంది. ఈ చిట్కాలు పాటించి ఒత్తిడిని దూరం చేసుకోండి.