YCP MLAS Have No Ethics: వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో 11 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో, జగన్ అసెంబ్లీ బాయ్‌కాట్‌కు పిలుపునిచ్చారు. కానీ, కొంతమంది ఎమ్మెల్యేలు అధినేత మాటను ధిక్కరించి, డిస్క్వాలిఫికేషన్కు దూరంగా ఉండాలని సభకు రహస్యంగా హాజరవుతున్నారు. సభలో కనిపించరు. సంతకాలు మాత్రం పెట్టి వెళ్తున్నారు. ఇప్పటికే స్పీకర్ వీరి వ్యవహారంపై సీరియస్‌గా స్పందించారు. దొంగ సంతకాలను అడ్డుకోవాలంటే రిజిస్ట్రర్‌ను సభ బయట కాకుండా, సభ లోపల ఉంచాలని కూటమి సభ్యుల నుండి సలహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సదరు దొంగ సంతకాల ఎమ్మెల్యేలపై చర్యలకు ఉపక్రమించింది.
ఎథిక్స్ కమిటీ సమావేశంలో, వైసీపీ ఎమ్మెల్యేలు రిజిస్టర్లో సంతకాలు చేసి.. సభలో పాల్గొనకుండా.. జీతభత్యాలు డ్రా చేసుకునేందుకు పెడుతున్న ‘దొంగ సంతకాలు’పై చర్చించారు. దాదాపు ఏడెనిమిది మంది ఇలా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. సభా నియమాల ప్రకారం, హాజరు లేకుండా జీతాలు తీసుకోవడం, సోషల్ మీడియాలో సభా సమావేశాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎథిక్స్‌కు విరుద్ధమని కమిటీ తేల్చింది. వచ్చే అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేల హాజరు పట్టికలు రిపోర్ట్ చేయాలంటూ కూడా శాసనసభ సెక్రటరీకి ఆదేశించారు.
Also Read: Balakrishna: బాలయ్య వర్సెస్ కామినేని.. అసెంబ్లీలో మాటల యుద్ధం
మంత్రి నారా లోకేష్ ముందుగానే ఈ దొంగ చాటుగాన్ని ఎత్తిచూపారు. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాట్రుడు కూడా వైసీపీ ఎమ్మెల్యేల ప్రవర్తనపై కన్ఫ్యూజన్ వ్యక్తం చేస్తూ, తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు ప్రివిలేజెస్ కమిటీకి రిఫర్ చేశారు. కమిటీ వ్యూహాత్మకంగా, ముందుగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చ పెట్టి, తర్వాత అనర్హతా వేటు వేయాలని నిర్ణయించింది. ఇది ప్రజలకు వారి తప్పులు అర్థమయ్యేలా చేస్తూ, శాసనసభ గౌరవాన్ని కాపాడుతుందని కూటమి నేతలు భావిస్తున్నారు. తాజా పరిణామాలతో వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. ఇదే కొనసాగితే… 60 పనిదినాల రూల్కి సంబంధం లేకుండా అంతకన్నా ముందే అనర్హత వేటు పడే అవకాశం ఉంది. దీంతో వైసీపీ మరికొన్ని స్థానాలు కోల్పోయే ప్రమాదం ఉంది.