Hyderabad: తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు సమ్మెకు దూరంగా ఉంటూ పేద ప్రజలకు చికిత్స అందిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్యసేవలు అందిస్తున్న 87 శాతం హాస్పిటళ్లు ఎటువంటి ఆటంకం లేకుండా పని చేస్తున్నాయి.
అయితే, కేవలం 13 శాతం ఆస్పత్రులలో మాత్రమే సేవలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆయా ఆస్పత్రులు కూడా తక్షణమే వైద్య సేవలను పునరుద్ధరించాలని ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటోందని, ఆరోగ్యశ్రీ పథకం కింద ఎవరూ చికిత్స కోసం ఇబ్బందిపడకూడదని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది.