Telugu Titans

Telugu Titans: పైరేట్స్‌ అదుర్స్‌ చివరి రోజు టైటాన్స్ మ్యాచ్

Telugu Titans: ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ  సీజన్లో పట్నా పైరేట్స్‌ అదరగొడుతోంది. శుక్రవారం నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో పట్నా 43-41 తేడాతో జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌ను ఓడించింది. పట్నా జట్టులో అయాన్‌ (14), దేవాంక్‌ (11) సత్తాచాటారు. జైపుర్‌ తరపున అర్జున్‌ దేశ్వాల్‌ (20) ఒంటరి పోరాటం చేశాడు. మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగడంతో ప్రేక్షకులు ప్రతి క్షణాన్నీ ఆస్వాదించారు. మరో మ్యాచ్‌లో దబంగ్‌ దిల్లీ 39-26తో తమిళ్‌ తలైవాస్‌పై గెలిచింది. గచ్చిబౌలి స్టేడియంలో ఈ సీజన్‌ మ్యాచ్‌లకు శని వారమే ఆఖరి రోజు. చివరి రోజు మ్యాచుల్లో తెలుగు టైటాన్స్‌ –  పుణెరి పల్టాన్‌, బెంగళూరు బుల్స్‌ – బెంగాల్‌ వారియర్స్‌ మధ్య పోటీలు జరుగుతాయి.

ఇది కూడా చదవండి: PV Sindhu: వచ్చే ఒలింపిక్స్ లోనూ ఆడతా.. ఫిట్నెస్ పై సింధు ధీమా

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Operation Loudspeaker: యుపిలో మల్లి లౌడ్‌స్పీకర్ లా సమస్య.. మసీదు లపై కేసులు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *