Mirai: మిరాయ్ సినిమా తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టీజర్‌లోనే అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకర్షించాయి. ఈ చిత్రం ఒక భారీ కథాంశంతో రెండు భాగాలుగా రూపొందనుందని సమాచారం. తేజా సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మంచు మనోజ్ బ్లాక్ స్వోర్డ్ అనే శక్తివంతమైన విలన్‌గా కనిపించనున్నారు. శ్రియా శరణ్, జగపతిబాబు, రితికా నాయక్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గౌరా హరి సంగీతం, ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. సెప్టెంబర్ 12న ఎనిమిది భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ సినిమాలో కొత్త ఒరవడిని సృష్టించనుందని అంటున్నారు.
