Hydra:కమిషనర్ ఏవీ రంగనాథ్ సారధ్యంలోని హైడ్రా అధికారుల బృందం గురువారం నుంచి రెండు రోజులపాటు బెంగళూరులో పర్యటించేందుకు వెళ్లింది. బెంగళూరు నగరంలోని చెరువుల పునరుజ్జీవంపై క్షేత్రస్థాయిలో స్థితిగతులను అధ్యయనం చేయడం,మురుగునీటిని స్వచ్ఛంగా మార్చడం, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో అనుసరించిన విధానాలను ఈ బృందం పరిశీలించనున్నది.
Hydra:బెంగళూరులో చెరువుల పునరుజ్జీవనం మాదిరిగా అధ్యయనం అనంతరం హైదరాబాద్ నగరంలోని బాచుపల్లిలోని ఎర్రగుంట చెరువు, మాదాపూర్‌లోని సున్నం చెరువు, కూకట్‌పల్లిలోని నల్లచెరువు, రాజేంద్రనగర్‌లోని అప్ప చెరువులకు పునరుజ్జీవనం కల్పించనున్నారు.
Hydra:అదే విధంగా భారీ వర్షాల సమయంలో హైదరాబాద్ మహానగరాన్ని వరదనీరు ముంచెత్తడం, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు బెంగళూరు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిపుణులతో హైడ్రా అధికారుల బృందం చర్చించనున్నట్టు తెలుస్తున్నది.