Telangana: తెలంగాణలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో పరిస్థితి తీవ్రంగా మారింది. గత మూడు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలతో రైలు, రోడ్ల రవాణా పూర్తిగా నిలిచిపోయింది.
రైళ్ల రద్దు – ట్రాక్ దెబ్బతింది
బిక్కనూరు మండలంలోని రామేశ్వరపల్లి సమీపంలో రైల్వే ట్రాక్ భారీ వరద నీటిలో కొట్టుకుపోయింది. దీని కారణంగా హైదరాబాద్–నిజామాబాద్ రూట్‌లో నడిచే రైళ్లు మొత్తం 40 వరకు రద్దు చేశారు. రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు అలర్ట్ జారీ చేశారు.
తలమడ్ల, జంగంపల్లి ప్రభావం
-
తలమడ్లలో రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి.
-
జంగంపల్లి దగ్గర వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
-
నేషనల్ హైవే–44 సహా పలు ప్రాంతీయ రహదారులు కూడా వరద నీటిలో మునిగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి: Bandi Sanjay: సిద్ధంగా ఉన్న తెలంగాణకు రాని ఆర్మీ హెలికాప్టర్ల .. బండి సంజయ్ ఆరా..
విద్యాసంస్థలకు సెలవులు
వరదల నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లోని విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు.
ప్రజల అరచి
కామారెడ్డిలోని GR కాలనీ పూర్తిగా నీట మునిగిపోయింది. స్థానికులు “ప్లీజ్ మమ్మల్ని రక్షించండి” అంటూ ప్రభుత్వం, సహాయక సిబ్బందిని వేడుకుంటున్నారు. ఇప్పటికే SDRF, NDRF బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.