Jananayagan: విజయ్ లాస్ట్ మూవీ జననాయగన్ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకి వచ్చింది. ఈ యాక్షన్ డ్రామాలో టాప్ డైరెక్టర్స్ స్పెషల్ రోల్స్‌లో కనిపించనున్నారట. ఎవరెవరు ఈ సినిమాలో ఉంటారు? వీరి పాత్రలు ఏంటి? పూర్తి వివరాలేంటో చూద్దాం!
Also Read: Jr NTR: ఎన్టీఆర్ ప్లాన్‌కు బ్రేక్!
జననాయగన్ చిత్రంలో తమిళ క్రేజీ డైరెక్టర్స్ సందడి చెయ్యనున్నారు. లోకేష్ కనగరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్ లాంటి టాప్ డైరెక్టర్స్ న్యూస్ రిపోర్టర్ల పాత్రలో కనిపించనున్నారు. ఈ యాక్షన్ డ్రామా 2026 పొంగల్‌కు గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో స్టార్ డైరెక్టర్స్ పాత్రలు సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయని టాక్. ఈ చిత్రం బాక్సాఫీస్‌పై భారీ ఇంపాక్ట్ చూపనుందని అంటున్నారు. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.