Unstoppable With NBK S4: బాలయ్య అన్ స్టాపబుల్ 4 సందడి సందడిగా సాగుతోంది. గత వారం దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’తో రాగా వచ్చే వారం సూర్య ‘కంగువ’ టీమ్ తో రచ్చ రచ్చ చేసేశాడు. వచ్చే శనివారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ ప్రోమో అదిరిపోయింది. అసలు సూర్య గురించి బాలకృష్ణ ఇచ్చిన ఇంట్రోనే గూజ్ బంప్స్ తెప్పించింది. నేను సింహం అయితే అతను సింగం… నేను లెజెండ్ అయితే… అతను గజనీ,. నేను అఖండ అయితే అతను రోలెక్స్… వన్ అండ్ ఓన్లీ.. సూర్య…. వెల్కమ్ తంబి… అనగానే సూర్య ఎంట్రీ ఇవ్వటం ఆకట్టుకుంది. ‘నేషనల్ అవర్డ్ కొట్టావ్… ఎవరెస్ట్ మీద నుంచి చూస్తుంటే ప్రపంచం ఏమనిపిస్తుంది…’ అన్న బాలయ్యతో ‘ఒక్క మాటలో చెప్పనా సార్… ఆకాశమే నా హద్దురా…’ అని చెప్పడం, కార్తీ తన ఫోన్ లో నీ పేరు ఏమని ఫీడ్ చేసుకున్నాడన్నదానికి ఫస్ట్ ప్రశ్ననే అవుటాఫ్ సిలబస్ సార్ అని బదులివ్వడం… ఫస్ట్ క్రష్ పేరు చెప్పమనగా… వద్దు సార్ ప్రాబ్లమ్ ఇంటికెళ్ళాలి అని సూర్య అనటం… ఒక నటి అంటే ఆయనకి చాలా ఇష్టమని కార్తీ చెప్పినపుడు ‘నువు కత్తి రా… కార్తీకాదు..’ అని సూర్య కామెంట్ చేయటం హిలేరియస్ అనిపించింది.
ఎపిసోడ్ మొత్తం పుల్ గా ఎంటర్ టైనింగ్ గా ఉంటుందని ప్రోమో చెప్పకనే చెప్పింది. ఇక ఎపిసోడ్ లో హార్ట్ టచింగ్ సందర్బాలు కూడా ఉన్నాయి. జ్యోతిక లేకుండా తన లైఫ్ ను ఊహించుకోలేనని సూర్య చెబుతూ తెలుగు ప్రజలు సహాయం చేయటంలో ముందుంటారని ప్రశంసించాడు. నలుగురికి మానవత్వంలో స్పందించి సేవ చేయటమే ఆనందకరమైన విషయమన్నారు సూర్య. ‘కంగువ’ ప్రచారంలో భాగంగా షో లో పాల్గొన్నప్పటికీ సూర్య క్యారక్టర్ ఏమిటనేది కూడా హైలైట్ అవుతుందనిపించింది.