Delhi Crime:

Delhi Crime: ఢిల్లీలో దారుణం.. క‌న్న‌త‌ల్లిపైనే అఘాయిత్యం

Delhi Crime: దేశ రాజ‌ధాని న‌గ‌ర‌మైన ఢిల్లీలో దారుణం చోటుచేసుకున్న‌ది. క‌న్న‌పేగే కాటేసిన ఈ ఘ‌ట‌న‌ స‌భ్య‌స‌మాజామే త‌లదించుకునేలా ఉన్న‌ది. కామంతో క‌ళ్లు మూసుకుపోయిన ఆ దండగుడు క‌న్న‌త‌ల్లిపైనే అఘాయిత్యానికి ఒడిగ‌ట్టాడు. తల్లిపై వివాహేత‌ర బంధాలున్నాయ‌నే అభాండం వేసిన ఆ దుర్మార్గుడు లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు.

Delhi Crime: ఢిల్లీ న‌గ‌రంలోని హైల్భాజీ ప్రాంతంలో బాధిత మ‌హిళ (65) కుటుంబం నివాసం ఉంటున్న‌ది. ఆమె భ‌ర్త రిటైర్డ్ ప్ర‌భుత్వ ఉద్యోగి. వారికి ఇద్ద‌రు కుమార్తెలు ఉండ‌గా, ఒక కొడుకు (39) ఉన్నాడు. గ‌త నెల 17న ఆ మ‌హిళ త‌న భ‌ర్త‌, చిన్న కూతురుతో క‌లిసి సౌదీ అరేబియాకు వెళ్లి వచ్చారు. వ‌చ్చీ రాగానే ఆమె కొడుకు త‌న మ‌న‌సులో ఏమ‌నుకున్నాడో ఏమో కానీ, అబాంధం వేశాడు.

Delhi Crime: త‌న త‌ల్లికి విడాకులు ఇవ్వాలంటూ త‌న తండ్రితో ఆ దుండ‌గుడు వాధించాడు. త‌న చిన్న‌త‌నంలో ఆమెకు వివాహేత‌ర బంధాలు ఉన్నాయ‌ని ఆరోపించాడు. ఇదే అద‌నుగా ఆమెను ఓ గ‌దిలో బంధించాడు. క‌న్న‌త‌ల్లి అనే విష‌యాన్ని మ‌రిచాడు. కామంతో క‌ళ్లు మూసుకుపోయాడు. పాపం, పుణ్యం విస్మ‌రించాడు. ఈ స‌మయంలో క‌న్న‌త‌ల్లిపైనే లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు.

Delhi Crime: ఆ త‌ర్వాత ఆ మాతృమూర్తి మ‌నస్తాపం చెందింది. పుట్టెడు దుఃఖంతో కుమిలిపోయిన ఆమె త‌న పెద్ద కుమార్తె ఇంటికి వెళ్లి త‌ల‌దాచుకున్న‌ది. కొడుకు పాపంతో కోపాన్ని పంటి బిగువున దాచుకున్న ఆ మ‌హిళ మ‌ళ్లీ ఆగ‌స్టు 11న తిరిగి సొంతింటికి చేరుకున్న‌ది. ఇప్పుడైనా త‌న కుటుంబంతో కులాసాగా ఉండాల‌నుకున్న‌ది.

Delhi Crime: కానీ ఆ కామాంధుడిలో రాక్ష‌స‌త్వం జ‌డ‌లు విప్పుకున్న‌ది. మ‌ళ్లీ వివాహేత‌ర బంధాల అభాంఢాన్ని త‌వ్వ‌సాగాడు. క‌న్న‌త‌ల్లిని అన‌రాని మాట‌లు అంటూ వేధించ‌సాగాడు. తొలిసారి లైంగిక‌దాడికి దిగిన అలుసుతో మ‌ళ్లీ అవకాశం కోసం వివాహేత‌ర బంధం ఉన్న‌ద‌న్న నాట‌క‌మాటాడు. ఆ వివాహేత‌ర బంధాల‌కు తాను శిక్ష వేస్తానంటూ గ‌దిలోకి తీసుకెళ్లి మ‌ళ్లీ లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. ఈ ద‌శ‌లో బాధిత మ‌హిళ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో నిందితుడిని అరెస్టు చేసి కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *