Health Tips

Health Tips: గులాబీ రేకులతో ఇన్ని ప్రయోజనాలా..

Health Tips: చాలా మంది చర్మకాంతి పెంచేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందాన్ని కాపాడుకోవాలనే తపన ప్రతి ఒక్కరికీ ఉంటుంది. చర్మం మెరుస్తూ ఉండటానికి చాలా మంది గులాబీ రేకులను ఉపయోగిస్తుంటారు. అయితే ఇది జుట్టుకు కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా? సాధారణంగా ఈ గులాబీ రేకులను ఆరోగ్యకరమైన, అందమైన బలమైన జుట్టు కోసం కూడా ఉపయోగించవచ్చు. అంతే కాకుండా ఇవి పుష్కలంగా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. గులాబీ రేకుల ఉపయోగాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రోజ్ శరీరంలోని మలినాలను బయటకు పంపి, జీవక్రియను మెరుగుపరుస్తుంది. గులాబీ రేకుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. త్వరగా బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఒక వరం.
రోజులో కొన్ని తాజా గులాబీ రేకులను తినడం ఇంద్రియాలకు మంచిది. అంతేకాదు సహజసిద్ధంగా చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుంది.

గులాబీ రేకులు అనేక అద్భుతమైన ఔషధ గుణాలను, పోషకాలను కలిగి ఉంటాయి. ఇందులో ఐరన్, విటమిన్ సి, ఎ, సోడియం, కాల్షియం, ఫైబర్ వంటి విటమిన్లు ఉంటాయి. ఇవి తలపై కనిపించే దురద, మంట, దద్దుర్లు రాకుండా కాపాడతాయి.

రోజా రేకులను రెగ్యులర్‌గా జుట్టు మీద అప్లై చేయడం వల్ల స్కాల్ప్ చాలా సేపు హైడ్రేట్‌గా ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే రోజా రేకులను జుట్టు పెరుగుదలకు ఉపయోగించవచ్చు. దీని కోసం కొన్ని గులాబీ రేకులను తక్కువ మంటలో ఉడికించాలి. చల్లారిన తర్వాత దానితో తలను బాగా మసాజ్ చేయాలి.గులాబీ రేకులతో కొబ్బరినూనెను వేడి చేసి, చల్లారిన తర్వాత తలకు పట్టిస్తే జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

గులాబీ రేకుల హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలి?
ఈ పువ్వు యొక్క తాజా రేకులను బాగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌కి అలోవెరా జెల్, పెరుగు కలపాలి. దీన్ని జుట్టుకు వారానికి ఒకటి లేదా రెండు సార్లు అప్లై చేయాలి. లేకపోతే, గులాబీ రేకులను రోజ్ మేరీ హెయిర్ ఆయిల్‌గా మెత్తగా పేస్ట్ చేసి, నూనెలో మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి.

గులాబీ రేకుల నుండి హెయిర్ స్ప్రే తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం కొన్ని గులాబీ రేకులను రెండు గ్లాసుల నీటిలో బాగా మరిగించి, చల్లార్చి స్ప్రే బాటిల్‌లో నిల్వ చేసుకోవాలి. ఆరోగ్యం, అందాన్ని కాపాడుకోవడంలో గులాబీ రేకులు అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా దేశీ గులాబీలను తరచుగా సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తారు.

ALSO READ  Rajyasabha Elections: ఆరు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల డేట్స్ ఫిక్స్!

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *