Elvish Yadav

Elvish Yadav: బిగ్‌బాస్ విన్నర్ ఎల్విష్ యాదవ్ ఇంటిపై కాల్పులు

Elvish Yadav: సోషల్ మీడియా సెలబ్రిటీ, బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 2 విజేత అయిన ఎల్విష్ యాదవ్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున గురుగ్రామ్‌లో జరిగింది. అదృష్టవశాత్తు, ఎవరికీ గాయాలు కాలేదు.

ఆదివారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో, ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి ఎల్విష్ యాదవ్ నివాసంపై దాదాపు 24 రౌండ్ల కాల్పులు జరిపారు. ఆ తర్వాత వారు అక్కడి నుంచి పారిపోయారు. ఈ దాడి జరిగినప్పుడు ఎల్విష్ ఇంట్లో లేడు, కానీ అతని కుటుంబ సభ్యులు, ఇంటి సహాయకుడు ఉన్నారు. కాల్పుల్లోని తూటాలు భవనం మొదటి అంతస్తులోకి దూసుకువెళ్లాయి.

Also Read: Suicide: “సంతోషంగా చనిపోతున్నా”: సెల్ఫీ తీసుకుని పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య

ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందాల సహాయంతో దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ కాల్పుల ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఎల్విష్ కుటుంబ సభ్యులకు ఈ ఘటనకు ముందు ఎలాంటి బెదిరింపులు రాలేదని వారు తెలిపారు.

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను గుర్తించడానికి సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ దాడి వెనుక గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో ఎల్విష్ యాదవ్ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  AP News: మ‌హాశివ‌రాత్రి వేడుక‌ల్లో అప‌శృతి.. గోదావ‌రిలో ఐదుగురు యువ‌కుల గల్లంతు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *