Ap news: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మృతి

Ap news: టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు. అనారోగ్య కారణలతో బాధపడుతున్న Ap news: టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు. అనారోగ్య కారణలతో బాధపడుతున్నఆయన మంగళవారం ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలోని నివాసంలో తుది శ్వాస విడిచారు. సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేతల్లో ఒకరు. మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీనియర్ ఎన్టిఆర్ సమక్షంలో టీడీపీలో చేరారు.ఆ సమయంలో ఆయనకు టికెట్‌ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు.

తొలిసారిగా 1983 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఆ పార్టీ తరఫున నాలుగుసార్లు పోటీ చేసి విజయం సాధించారు. 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా పోటీ చేసి గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కేబినెట్‌లో పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రిగా సేవలందించారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా, అసెంబ్లీలో అంచనాల కమిటీ చైర్మన్‌గా వివిధ హోదాల్లో పని చేశారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అనారోగ్య కారణలతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలోని నివాసంలో తుది శ్వాస విడిచారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Bheemili: కుమారైకు అత్తింటి వేధింపులు తండ్రి ఆత్మహత్య!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *