Health Tips: మనం ఉదయం ఏమి తింటాము అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఉదయం పూట తినే ఆహారమే ఆ రోజుమనల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల పలు సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆమ్ల ఆహారాలు తింటే ఎసిడిటీకి కూడా దారి తీస్తుందని సూచిస్తున్నారు. మరి పొద్దున్నే ఖాళీ కడుపుతో తినకూడని ఆహారాలు ఎంటో చూద్దాం
మసాలా ఆహారాలు
మసాలా ఆహారాలు యాసిడ్ రిఫ్లక్స్ లేదా అజీర్ణానికి దారి తీయవచ్చు, దీని వలన గుండెల్లో మంట, నొప్పి , అసౌకర్యం రోజంతా ఉంటుంది.
కాఫీ
ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. కొంతమందిలో అసౌకర్యం కలుగుతుంది.
సిట్రస్ పండ్లు
సిట్రస్ పండ్లు ఆమ్లంగా ఉంటాయి.. ఖాళీ కడుపుతో తీసుకుంటే వివిధ జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. ఆరెంజ్, కివీస్, పైనాపిల్స్ మొదలైన వాటిని ఉదయం ఖాళీ కడుపుతో తినకూడదు. ఈ పండ్లలో ఫైబర్. ఫ్రక్టోజ్ అధికంగా ఉంటాయి.
కార్బోనేటేడ్ పానీయాలు
కార్బోనేటేడ్ డ్రింక్స్ గ్యాస్, ఇతర జీర్ణ సమస్యలను కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. కానీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి జీర్ణ సమస్యలు మాత్రమే కారణం కాదు.
స్వీట్లు
చక్కెర ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచడానికి కారణమవుతాయి.
ప్రాసెస్ చేసిన ఆహారాలు
ప్రాసెస్ చేసిన ఆహారాలలో తరచుగా ప్రిజర్వేటివ్‌లు, సంకలనాలు, కృత్రిమ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇది వివిధ జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.
కాగా.. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌లతో కూడిన సమతుల్య అల్పాహారం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి, దృష్టి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి, శక్తిని అందించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.