Regina Cassandra: సినీ ఇండస్ట్రీలో రెజీనా కసాండ్రా గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లో రెజీనా తన నటనతో గుర్తింపును తెచ్చు కుంది. ఇండస్ట్రీలోకి దాదాపు పదేళ్లు పూర్తవుతున్న ఈ తమిళ్ బ్యూటీ ఇక తన హవా కొనసాగిస్తూనే ఉంది. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీలోకి తాను కొత్తగా వచ్చినప్పుడు ఎదుర్కొన్న అను భవాలను రెజీనా గుర్తుచేసుకుంది.
బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లాలనుకున్న సమయంలో ముంబైలో నెట్వర్కింగ్ ఈవెంట్లకు హాజరుకావాలని ఆమెకు కొందరు సలహా ఇచ్చారట. కానీ సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ పనులన్నీ పీఆర్వోలు, మేనేజర్లే చూసుకునేవారు. బాలీవుడ్ లో చాలా పోటీ వాతావరణం ఉంటుందని, సెల్ఫ్ క్యాంపెయిన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని రెజీనా చెప్పు కొచ్చింది. సౌత్‌లో భాష రాకపోయినా అవకాశాలు ఇస్తారు. కానీ బాలీవుడ్‌లో అలా కాదు. హిందీ రాకపోతే చాలా దారుణంగా చూస్తారంది.
Regina Cassandra: పని కోసం తనను తాను అమ్ముకోనని, లాబీయింగ్ చేసే వ్యక్తిని కాదని కుండలు బద్ధలు కొట్టింది. కానీ తాను అలా చేయకపోతే అవకా శాలు పొందలేనని వెల్లడించింది. నిజానికి ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లు ఎప్పుడైనా యాక్టివ్ గా ఉండాలంది. ఇక రెజీనా సినిమాల విషయానికొ స్తే తమిళ్ లో తళా అజిత్ తో కలిసి విదాముయార్చి సినిమా చేస్తోంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. తెలుగులో గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న జాత్, హిందీలో సెక్షన్ 108 మూవీల్లో నటిస్తోంది.