Upasana

Upasana: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం: ఉపాసనకు కీలక బాధ్యతలు

Upasana: మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెలకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌కు ఆమెను కో-చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ గోయెంకా ఈ బోర్డుకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

ఉపాసన కృతజ్ఞతలు : 
తనకు ఈ అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి ఉపాసన ధన్యవాదాలు తెలిపారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆమె స్పందిస్తూ, “తెలంగాణను ప్రపంచ స్థాయి క్రీడా శక్తిగా మార్చడానికి సంజయ్ గోయెంకాతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాల ద్వారా రాష్ట్రంలో క్రీడా రంగాన్ని ప్రోత్సహించడానికి ఇది ఒక గొప్ప అడుగు” అని పేర్కొన్నారు.

Also Read: Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం-రహస్య గోరఖ్ బాబు నామకరణం.. పేరు ఏంటంటే.?

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ బోర్డులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు స్థానం కల్పించారు. బోర్డు సభ్యులుగా సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్, క్రికెటర్ కపిల్ దేవ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, ఫుట్‌బాల్ ఆటగాడు భూటియా, షూటర్ అభినవ్ బింద్రా వంటివారు ఉన్నారు. ఈ నియామకంపై మెగా కుటుంబ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కొత్త క్రీడా విధానాన్ని తీసుకొచ్చింది. క్రీడా రంగంలో రాజకీయ జోక్యం తగ్గించి, ప్రైవేటు-పబ్లిక్ భాగస్వామ్యంతో మెరుగైన క్రీడాకారులను తయారు చేయడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించేలా క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Raj Pakala: రాజ్ పాకాలను జ‌న్వాడ ఫామ్ హౌస్ కు తీసుకుకెళ్లిన పోలీసులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *