Nimmala Ramanaidu: కర్నూలు ఉల్లి మార్కెట్ ను జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు సందర్శించారు. ఉల్లి రైతులతో మాట్లాడారు. గత వారం రోజుల క్రితం సర్వర్ పని చేయక మార్కెట్ కు భారీ ఎత్తున ఉల్లి రావడంతో రైతులు పడిగాపులు కాచారు. ఈ నేపథ్యంలో ఇవాళ మినిస్టర్ నిమ్మల రామానాయుడు రైతులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని… తమ ప్రభుత్వం ఎప్పుడూ రైతుల పక్షాన ఉంటుందని చెప్పారు.
