Crime News: సమాజంలో నమ్మకాలు, బంధాలు రోజురోజుకీ పలచబడిపోతున్నాయి. ఆస్తి కోసం, వివాహేతర సంబంధాల కోసం భార్యలు భర్తలను హత్య చేసేందుకు పాల్పడుతున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువవుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో మరో దారుణం బయటపడింది.
ప్లాన్ ప్రకారం భర్తపై దాడి
కుత్బుల్లాపూర్‌లోని దుండిగల్ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాచుపల్లి రాజీవ్ గృహకల్పలో నివాసముంటున్న రాందాస్ నాయక్, జ్యోతి దంపతులు 2009లో పెళ్లి చేసుకున్నారు. కొన్ని గొడవల కారణంగా గత మూడేళ్లుగా విడిగా ఉంటున్నారు. నెల క్రితం కుటుంబ పెద్దల సయోధ్యతో మళ్లీ కలసి ఉండటం ప్రారంభించారు. కానీ మళ్లీ గొడవలు మొదలయ్యాయి.
ఇది కూడా చదవండి: Telangana Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం…బీసీ రిజర్వేషన్‌పై చర్చ
జూలై 26న రాత్రి భర్తను హత్య చేయాలని జ్యోతి ప్లాన్ వేసింది. నలుగురు యువకులతో కలిసి బౌరంపేట్‌లో రాందాస్‌కు మద్యం తాగించి, బీర్ సీసాలు, రాళ్లతో దాడి చేయించింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన రాందాస్ చనిపోయాడని అనుకొని యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
రక్తపు గాయాలతో భర్త బతికి బయటపడ్డాడు
గంట సేపటి తర్వాత రాందాస్ సృహలోకి వచ్చి, తీవ్ర గాయాలతో సాయి నగర్‌లోని తన తమ్ముడి ఇంటికి చేరుకుని జరిగిన విషయం వివరించాడు. అతని తమ్ముడు వెంటనే బాచుపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. అనంతరం బాచుపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
కేసు దర్యాప్తు
ఈ ఘటన దుండిగల్ పీఎస్ పరిధిలోకి వస్తుండటంతో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును దుండిగల్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. భర్తపై హత్యాయత్నానికి అసలు కారణం గొడవలేనా? లేక వివాహేతర సంబంధాలేనా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

