Chandrababu

Chandrababu: ఏపీని హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీగా మారుస్తాం

Chandrababu: అమరావతిని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సింగపూర్‌లో జరిగిన తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో తెలంగాణ తలసరి ఆదాయంలో ముందంజలో ఉండటానికి కారణం తాను తీసుకొచ్చిన ఐటీ విప్లవమేనని చెప్పారు. 1995లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలను ప్రోత్సహించటం, హైటెక్ సిటీ ద్వారా ఐటీ రంగానికి బలమైన పునాది వేయటం వల్లనే నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఐటీ రంగంలో అగ్రస్థానంలో ఉన్నారని అన్నారు.

2019లో ప్రభుత్వం మారకపోతే ఇప్పటికి అమరావతి నిర్మాణం పూర్తయ్యేదని చంద్రబాబు అన్నారు. సింగపూర్ ఉచితంగా రూపొందించిన అమరావతి మాస్టర్ ప్లాన్‌ను అడ్డుకోవడం వైసీపీ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు అని వ్యాఖ్యానించారు. ఆ తప్పులను సరిదిద్దడానికే సింగపూర్‌కి వచ్చానని, 2014లో ఇచ్చిన హామీ ప్రకారం సింగపూర్‌లా అమరావతిని అందంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

ఆర్థిక సంస్కరణల గురించి మాట్లాడిన చంద్రబాబు, 1995లో సీఎం అయిన వెంటనే సంస్కరణలను ప్రారంభించానని చెప్పారు. ప్రైవేట్ సెక్టార్‌లో పవర్ ప్రాజెక్ట్‌లు, ఎయిర్‌పోర్ట్‌లాంటి అభివృద్ధి ప్రాజెక్టులు తానే తీసుకొచ్చానని తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌, స్థానిక సంస్థల్లో 8 శాతం రిజర్వేషన్‌ ఇచ్చింది కూడా తానేనని గుర్తు చేశారు. పీ4 విధానం అమలు చేస్తే పేదరికం పోతుందని, 2029 నాటికి పేదరికాన్ని పూర్తిగా తొలగించడమే తన లక్ష్యమని చెప్పారు.

ఇది కూడా చదవండి: Srushti Test Tube Baby Case: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు.. ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలు

ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో తెలుగువారు ఉన్నారని, సింగపూర్‌లోనే 40 వేల మంది తెలుగు ప్రజలు ఉన్నారని చంద్రబాబు గర్వంగా చెప్పారు. నాదేండ్ల సత్య వంటి ప్రతిభావంతులు నేడు ప్రపంచ స్థాయి సీఈవోగా ఎదగడం మన గర్వకారణమని అన్నారు.

భవిష్యత్తు ప్రణాళికల గురించి చంద్రబాబు మాట్లాడుతూ, 2047 నాటికి భారత్ ప్రపంచంలో నెంబర్ వన్‌ దేశంగా నిలుస్తుందని, తెలుగువారు ప్రపంచ అగ్రస్థానంలో ఉండాలనేది తన ఆకాంక్ష అని చెప్పారు. అమరావతిలో క్యాంటమ్ వ్యాలీ, AI సిటీ ఏర్పాటు చేస్తామని, ఏపీలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ నిర్మాణం చేస్తామని, పోర్టుల ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతులు జరిపే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 2047 నాటికి వికసిత్ భారత్‌, స్వర్ణాంధ్ర సాధిస్తామని, ఏపీలో హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీని నిర్మించడం తన సంకల్పమని చంద్రబాబు స్పష్టం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *