Chandrababu: అమరావతిని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సింగపూర్లో జరిగిన తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో తెలంగాణ తలసరి ఆదాయంలో ముందంజలో ఉండటానికి కారణం తాను తీసుకొచ్చిన ఐటీ విప్లవమేనని చెప్పారు. 1995లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలను ప్రోత్సహించటం, హైటెక్ సిటీ ద్వారా ఐటీ రంగానికి బలమైన పునాది వేయటం వల్లనే నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఐటీ రంగంలో అగ్రస్థానంలో ఉన్నారని అన్నారు.

