Minister Seethakka: తెలంగాణ ప్రభుత్వ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీతక్క ఇవాళ (బుధవారం) నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. 2021లో కరోనా మహమ్మారి సమయంలో ప్రజల కోసం పోరాడిన సంఘటనే ఇప్పుడు ఆమెకు కేసుగా మారింది.
కరోనా చికిత్స కోసం నిరాహార దీక్ష
అప్పట్లో ఆరోగ్యశ్రీ (Aarogya Sri) లో కరోనా వైద్యం తీసుకురావాలన్న డిమాండ్‌తో సీతక్క ఇందిరా పార్క్ వద్ద ఎన్ఎస్‌యూఐ నాయకులతో కలిసి అమరణ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఉచిత అంబులెన్స్ సేవలు, కరోనా బిల్లుల చెల్లింపుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) నుండి ఆర్థిక సహాయం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Anil Kumar: బిగ్ షాక్.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు పోలీసులు నోటీసులు
నిషేధాజ్ఞల మధ్య దీక్ష – కేసుగా మారిన ఘటన
కరోనా సమయంలో ప్రభుత్వం జారీ చేసిన నిషేధాజ్ఞలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో సీతక్కపై కేసు నమోదైంది. దీక్ష చేసిన సమయంలో గుంపులుగా చేరవద్దని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ, ప్రజల సమస్యల కోసం ఆందోళన చేపట్టిన సీతక్కపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
న్యాయస్థానంలో హాజరు – తదుపరి విచారణ ఆగస్టు 13కు వాయిదా
ఈ కేసులో ఇవాళ నాంపల్లి ప్రత్యేక కోర్టులో సీతక్క హాజరయ్యారు. కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను రీకాల్ చేస్తూ, ఆమెకు రూ.10,000 చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 13కి వాయిదా వేసింది.