Poonam Pandey: శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా మొబైల్ యాప్‌ల ద్వారా అశ్లీల కంటెంట్ సృష్టించిన కేసులో 2021 జులైలో అరెస్టయ్యారు. ఈ కేసు నమోదైన ముందు నటి పూనమ్ పాండే కుంద్రాపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనతో కాంట్రాక్ట్ ముగిసినా, ఆర్మ్‌స్ప్రైమ్ మీడియా తన వీడియోలను ఉపయోగించిందని, వ్యక్తిగత మొబైల్ నంబర్‌ను లీక్ చేసి వేధింపులకు గురిచేశారని ఆమె ఆరోపించారు. ఈ లీక్ వల్ల అనేక బెదిరింపు కాల్స్, సందేశాలు వచ్చాయని పూనమ్ వెల్లడించారు. కాంట్రాక్ట్ కోసం బెదిరించి సంతకం చేయమన్నారని కూడా ఆమె పేర్కొన్నారు. ఈ ఆరోపణలతో పోలీసులు లోతైన విచారణ చేపట్టగా, కుంద్రా అశ్లీల కంటెంట్ తయారీపై కేసు నమోదైంది. మహారాష్ట్ర సైబర్ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయగా, సుప్రీంకోర్టు కుంద్రా, పూనమ్, షెర్లిన్ చోప్రాతో పాటు ఇతరులకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
