India Post Office: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని పోస్టాఫీసులు మూడు రోజులపాటు తాత్కాలికంగా మూతపడనున్నాయి. డిజిటల్ ఎక్సలెన్స్, జాతి నిర్మాణం దిశగా తపాలా శాఖ కొత్త నెక్ట్స్ జనరేషన్ ఏపీటీ అప్లికేషన్‌ను ప్రారంభించనుంది.
ఎప్పుడు సేవలు నిలిపివేస్తారు?
తిరుపతి డివిజన్‌లోని అన్ని పోస్టాఫీసుల్లో ఈ నెల జూలై 22న అప్‌గ్రేడ్ ప్రక్రియను అమలు చేయనున్నారు.
దీనికి ముందు జూలై 19 నుండి 21 వరకు ప్రణాళికాబద్ధంగా డౌన్‌టైమ్ అమలు చేస్తారు. ఈ మూడు రోజుల్లో పోస్టాఫీసుల్లో ఎటువంటి ప్రజా లావాదేవీలు జరగవు.
ఇది కూడా చదవండి: Crime News: అల్లూరి జిల్లాలో తల్లిదండ్రులను గొడ్డలితో నరికి చంపిన కొడుకు
పోస్టాఫీసుల సీనియర్ సూపరింటెండెంట్ మేజర్ సయిదా తన్వీర్ తెలిపారు, “డేటా మైగ్రేషన్, సిస్టమ్ ధృవీకరణలు, కాన్ఫిగరేషన్ ప్రక్రియలు సజావుగా జరగాలంటే సేవలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వస్తోంది. కొత్త సిస్టమ్ లైవ్ లోకి వెళ్లిన తర్వాత వేగవంతమైన, సులభమైన సేవలు అందిస్తాం” అని చెప్పారు.
ఏ ప్రాంతాల్లో అమలు అవుతుంది?
నెక్ట్స్ జనరేషన్ ఏపీటీ అప్లికేషన్ అమలులో భాగంగా జూలై 21న తెలంగాణలోని రంగారెడ్డి, నల్లగొండ, యాదాద్రి-భువనగిరి జిల్లాలు మినహా అన్ని పోస్టాఫీసుల్లో లావాదేవీలు నిలిపివేస్తారు. ఈ వివరాలను అసిస్టెంట్ పోస్ట్‌మాస్టర్ జనరల్ (టెక్ ఆపరేషన్స్) నరేష్ వెల్లడించారు.
ప్రజలకు కలిగే ప్రయోజనాలు
కొత్త ఏపీటీ అప్లికేషన్ ద్వారా:
✅ వేగవంతమైన సేవలు
✅ మెరుగైన వినియోగదారుల అనుభవం
✅ కస్టమర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్ అందుబాటులోకి రానున్నాయి.