Kriti Sanon

Kriti Sanon: క్రికెట్‌ స్టేడియంలో రహస్య ప్రియుడితో మహేష్ హీరోయిన్‌..!

Kriti Sanon: కృతి సనన్ తెలుగు తెరపై మహేష్ బాబుతో ‘1 నేనొక్కడినే’ సినిమాతో అడుగుపెట్టారు. సినిమా విజయం సాధించకపోయినా, బాలీవుడ్‌లో ‘హీరోపంతి’తో ఆమెకు బ్రేక్ దక్కింది. ఈ చిత్రం విజయంతో హిందీలో వరుస అవకాశాలు అందుకున్నారు. నాగ చైతన్యతో ‘దోచెయ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా, ఆమె బాలీవుడ్‌లో ‘బరేలీ కీ బర్ఫీ’, ‘లుకా ఛుప్పీ’ వంటి హిట్స్‌తో స్టార్‌గా ఎదిగారు. 2023లో ప్రభాస్‌తో ‘ఆదిపురుష్’ ద్వారా తెలుగు ప్రేక్షకులను మళ్లీ పలకరించారు. ఇక ప్రేమ వ్యవహారంలో కృతి, వ్యాపారవేత్త కబీర్ బహియాతో డేటింగ్‌లో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. లండన్‌లోని లార్డ్స్ స్టేడియంలో ఇండియా-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్‌ను వీరిద్దరూ కలిసి చూసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బెంగళూరులో స్నేహితుడి పెళ్లిలో కలిసిన వీరు, అక్కడి నుంచి స్నేహాన్ని ప్రేమగా మార్చారట. సినిమాలతో బిజీగా ఉన్న కృతి, షూటింగ్‌లు లేనప్పుడు కబీర్‌తో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. మరి కృతి దీని గురించి ఎప్పుడు ఓపెన్ అవుతుందో చూడాలి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Revanth Reddy: సినీ ఇండస్ట్రీని కడిగిపారేసిన రేవంత్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *