congress

Congress: ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ విమర్శలు

Congress: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని కాంగ్రెస్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అయితే, ఈసీ కాంగ్రెస్ ఫిర్యాదును తిరస్కరించింది. దీనిపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. తమ ఫిర్యాదులకు ఎన్నికల సంఘం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదంటూ  కాంగ్రెస్‌ ఈసీకి లేఖ రాసింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్, ఇతర కాంగ్రెస్ నేతలు రాసిన లేఖలో ఎన్నికల సంఘం సమాధానం అవమానకర రీతిలో ఉందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Sadar Festival: ఘనంగా సదర్ పండుగా.. ముఖ్యఅతిథిగా ఈటెల రాజేంద్ర

ఎన్నికల సంఘం ఇలాంటి పదజాలాన్ని ఉపయోగించడం కొనసాగిస్తే, అటువంటి వ్యాఖ్యలకు కోర్టును ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదని కాంగ్రెస్ చెప్పింది. ఎన్నికల సంఘం క్లీన్ చిట్ ఇచ్చింది. కమిషన్‌కు ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియదు కానీ.. రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైన సంస్థ అనే విషయాన్ని కమిషన్‌ మరిచిపోయినట్లుంది అంటూ లేఖలో కాంగ్రెస్ నాయకులు ఈసీపై విరుచుకుపడ్డారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Revanth vs KTR: సైకో వర్సెస్‌ శాడిస్ట్‌..కేసీఆర్ వర్సెస్‌ రేవంత్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *