Solo Boy

Solo Boy: ‘సోలో బాయ్’ – మిలియనీర్‌గా మారిన సామాన్య కుర్రాడి కథ!

Solo Boy: ఒక మధ్యతరగతి కుర్రాడి సక్సెస్ స్టోరీగా రూపొందిన ‘సోలో బాయ్’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మధ్యతరగతి కుటుంబంలోని కష్టాలు, అవమానాలు, అప్పులు, సాధించాలనే కసిని నిజాయతీగా చూపించారు. కాలేజీ లైఫ్, బ్రేకప్ బాధలు, ప్రేమ, పెళ్లి, తండ్రి మరణం, అప్పుల నుంచి మిలియనీర్‌గా మారిన కృష్ణమూర్తి పాత్రలో గౌతమ్ నటన అద్భుతం. రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి ఫ్రెష్ లుక్‌తో ఆకట్టుకున్నారు. అనితా చౌదరి, పోసాని తల్లిదండ్రుల పాత్రల్లో చక్కగా సరిపోయారు.

Also Read: Hari Hara Veeramallu: ఆల్ టైం రికార్డుతో దూసుకుపోతున్న హరిహర వీరమల్లు ట్రైలర్‌!

Solo Boy: సినిమాకు మ్యూజిక్, బీజీఎం ప్రధాన బలం. కొన్ని డైలాగ్స్ థియేటర్లో చప్పట్లు కొట్టించాయి. కథనంలో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ, సంతృప్తికరమైన క్లైమాక్స్‌తో సినిమా గుండెల్లో నిలుస్తుంది. రైతుల దళారుల సమస్యను స్పృశిస్తూ కథను దారి తప్పకుండా నడిపారు. రెండున్నర కోట్ల బడ్జెట్‌తో ఇలాంటి కంటెంట్ రాబట్టడం గ్రేట్ అనే చెప్పాలి. చిన్న బడ్జెట్‌తో ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే ఈ సినిమా ఆహ్వానించదగిన ప్రయత్నం అనే చెప్పాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *