KCR:మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆసుపత్రి నుంచి శనివారం (జూలై 5న) డిశ్చార్జి అయ్యారు. హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసానికి ఆయన చేరుకున్నారు. రెండు రోజులుగా ఆయన ఖైరతాబాద్‌లోని యశోద దవాఖానకు సాధారణ వైద్య పరీక్షల కోసం వెళ్లారు. ఆయనకు అక్కడి వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహించి, రెండు రోజులు ఆసుపత్రిలో ఉండాల్సిందిగా కోరడంతో ఆయన అడ్మిట్ అయ్యారు.
KCR:ఈ మేరకు ఆయన ఆరోగ్యం సాధారణ స్థితికి చేరుకోవడంతో వైద్యులు శనివారం కేసీఆర్‌ను వైద్యులు డిశ్చార్జి చేశారు. జ్వరం తగ్గడంతోపాటు షుగర్, సోడియం స్థాయిలు సాధారణ స్థితిలోకి వచ్చాయి. శుక్రవారం రోజు ఆసుపత్రిలోనే ఆయనను పరామర్శించడానికి వచ్చిన బీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్ మాటా మంతి మాట్లాడుకున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులతోపాటు వాతావరణ పరిస్థితులు, పంటలు, నీటి సరఫరా అంశాలపై వారితో కేసీఆర్ ముచ్చటించినట్టు తెలిసింది. ఆయన డిశ్చార్జి కావడంతో ఆందోళనలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.