Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా మరో సినిమాతో సందడి చేస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతున్న ఈ ఫ్యాంటసీ కామెడీ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా ప్రారంభమైంది. నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టగా, మల్లిది వశిష్ట కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కళ్యాణ్ శంకర్ ముహూర్తపు సన్నివేశానికి దర్శకత్వం వహించారు.
Also Read: Sharvari: శార్వరి గ్లామర్ జాతర.. బికినీ ఫోటోషూట్‌తో సోషల్ మీడియాలో సంచలనం!
Niharika Konidela: జూలై 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో జరగనుంది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను తదితరులు నటిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం, రాజు ఎడురోలు సినిమాటోగ్రఫీ, అన్వర్ అలీ ఎడిటింగ్, రామాంజనేయులు ప్రొడక్షన్ డిజైన్‌తో సాంకేతిక బృందం సిద్ధమైంది. మానస శర్మ కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లను మహేష్ ఉప్పాలతో కలిసి అందించారు.