Anirudh Ravichander

Anirudh Ravichander: అనిరుధ్ మ్యాజిక్‌ పూర్తిగా మిస్?

Anirudh Ravichander: ఫర్ ది ఫస్ట్ టైం సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న ‘కూలీ’ సినిమా విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి తొలి సింగిల్ ‘చికెట్’ రిలీజై, సోషల్ మీడియాలో మిక్స్డ్ రెస్పాన్స్ మూటగట్టుకుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతంలో, టి రాజేందర్ ఆలపించిన ఈ గీతం ప్రోమోతో అయితే భారీ అంచనాలను రేకెత్తించింది. అయితే,’విక్రమ్’, ‘జైలర్’ లాంటి హిట్ ట్రాక్‌లను ఆశించిన ఫ్యాన్స్‌కు ఈ సాంగ్ నిరాశనిచ్చింది. కొందరు అనిరుధ్ గత హిట్స్‌తో పోలిస్తే ఈ పాట అస్సలు బాగోలేదని కామెంట్ చేస్తున్నారు. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ‘కూలీ’ నుంచి రాబోయే ట్రాక్‌లు మరింత జోష్‌ను అందిస్తాయని సూపర్ స్టార్ అభిమానులు ఆశిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Viral Video: ఆత్మీయమైన తల్లి ప్రేమ: నిద్రలో ఉన్న పిల్ల ఏనుగును మేల్కొల్పుతున్న వీడియో వైరల్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *