Ambatiki Jagan Gift

Ambatiki Jagan Gift: పాపం అంబటి..! సింగయ్య కేసులో పేరు లేనందుకే పనిష్మెంటా?

Ambatiki Jagan Gift: గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గం ఏడాదిగా వైసీపీకి ప్రశ్నార్థకంగా మారిన సెగ్మెంట్‌. వైసీపీకి సరైన అభ్యర్థులే దొరకని నియోజకవర్గంగా, వైసీపీ గెలుపే లేని నియోజకవర్గంగా ఉందా అసెంబ్లీ సెగ్మెంట్. రాష్ట్ర విభజన తర్వాత ఒక్కసారంటే ఒక్కసారి కూడా అక్కడ వైసీపీ బోణీ కొట్టిందే లేదు. ఎన్నికలు పూర్తయి సంవత్సరం పూర్తవుతున్నా ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌కి వైసీపీ తరఫున ఇన్‌చార్జిగా ఉండడానికి సైతం ఎవరూ ముందుకు రాలేదు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత రాష్ట్రంలో 174 నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లని నియమించిన వైసీపీ అధిష్ఠానం, గుంటూరు వెస్ట్‌ విషయంలో మాత్రం నిన్నటి దాకా ఇన్‌చార్జిని నియమించలేక పోయింది. ఎందుకంటే ఆ నియోజకవర్గం పేరు చెబితేనే వైసీపీ నేతలు పారిపోతూ వచ్చారు. వైసీపీని అంతలా భయపెట్టిన గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గం ఇంచార్జ్‌ పదవి ఇప్పుడు ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌ అంబటి రాంబాబుని వరించింది.

2014 ఎన్నికల్లో లేళ్ల అప్పిరెడ్డి, 2019లో చంద్రగిరి ఏసురత్నం వైసీపీ అభ్యర్థులుగా గుంటూరు వెస్ట్‌ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక 2024లో వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన విడదల రజినీ.. టీడీపీ బీసీ మహిళా అభ్యర్థి గల్లా మాధవిపై 51 వేల ఓట్ల భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. ఆర్థికంగా బాగా సౌండ్‌ అయిన విడదల రజినీ.. ఇక్కడ ఎలాగైనా గెలవాలని.. సామ దాన బేధ డందోపాలయని వాడినా ఓటమి తప్పలేదు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా గల్లా మాధవి గెలుపు తర్వాత… రజినీ తిరిగి చిలుకలూరి పేటకు రిటర్న్‌ టికెట్‌ తీసుకున్నారు. దీంతో సంవత్సరం నుంచి ఈ నియోజకవర్గంలో వైసీపీకి ఇన్‌చార్జి లేరు. జిల్లాలో వైసీపీ నేతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. ఇప్పుడు గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గానికి ఇంచార్జ్‌గా అంబటిని పంపుతున్నారు జగన్‌మోహన్‌రెడ్డి. అయితే ఇది అంబటికి పదవి ఇచ్చినట్లా? లేక పనిష్మెంటా? అన్న చర్చ జిల్లా వైసీపీ వర్గాల్లో నడుస్తోంది.

Also Read: Pawan Kalyan: రెండేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం..

జగన్‌ సత్తెనపల్లి పర్యటన ఎంతటి వివాదానికి దారి తీసిందో తెలిసిందే. జగన్‌మోహన్‌ రెడ్డి రథ చక్రాల కింద పడి నలిగి, కృషించి మరణించాడు పేద దళిత వృద్ధుడు సింగయ్య. ఈ కేసు ఏకంగా జగన్ మెడకే చుట్టుకుంది. జగన్‌మోహన రథాన్ని పోలీసులు సీజ్‌ చేసి పట్టుకుపోవడం కూడా జరిగింది. జగన్‌ పర్యటన జరిగింది సత్తెనపల్లి నియోజకవర్గంలో అయితే.. పక్క నియోజకవర్గాలకు చెందిన నేతలు విడదల రజనీ, పేర్ని నానిలను నిందితులుగా చేర్చారు పల్నాడు జిల్లా పోలీసులు. కానీ సత్తెనపల్లికి చెందిన అంబటి రాంబాబు పేరుని మాత్రం ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదు. దీనికి కారణం రజిని, పేర్ని నానిలు తమ తమ నియోజకవర్గాల నుండి భారీగా జనాలను మొబిలైజ్ చేయడమే. అయితే అంబటి హైవేల మీద పెట్టిన బారికేడ్లను బద్ధలు కొడుతూ నానా హంగామా చేశారు కానీ.. జన సమీకరణలో అంబటి పాత్ర లేదని పోలీసులు తేల్చారు. మాజీ మంత్రిగా చేసిన అంబటికి ఉన్న ప్రజాధరణ అలాంటిది మరి. నాయకులు, కార్యకర్తలే పట్టుమని పది మంది కూడా అంబటి పక్కన ఉండరు. ఇక అంబటి పిలుపిస్తే ప్రజలేం వస్తారు? అలా జగన్‌ మోహన్‌రెడ్డితో కలిసి సహ నిందితుడిగా ఉండే అవకాశం కోల్పోయారు అంబటి రాంబాబు.

ALSO READ  Ambati Fake Factory: జగన్‌ దొంగ ఓట్ల ఆరోపణలు.. లెవెల్‌ చేసిన అంబటి!

Also Read: Subhanshu Shukla: అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా తొలి సందేశం: ‘ఇదో గొప్ప ప్రయాణం’

అయితే జగన్ సత్తెనపల్లి పర్యటనకు హైప్‌ తీసుకొచ్చింది మాత్రం అంబటి రాంబాబు చేసిన ఓవరాక్షనే అని చెప్పక తప్పదు. జగన్‌ పర్యటన రోజు నుండి కూడా అంబటి రాంబాబే ప్రెస్మీట్లు పెట్టి టీడీపీని, ప్రభుత్వాన్ని ఏకేస్తున్నారు, సొంత యూట్యూబ్‌ చానల్‌లో ఘోషిస్తున్నారు. నిజానికి సత్తెనపల్లి ఇంచార్జ్ పదవి నుంచి పీకేసినప్పటి నుండి.. అంబటికి వేరే పదవి లేకుండా పోయింది. అయితే జగన్‌ తన పర్యటనలో ఓ ప్రాణం పోయినప్పటికీ రావాల్సినంత హైపు, హంగామా క్రియేట్‌ అయ్యింది కాబట్టి, అందుకు కారణమైన అంబటి రాంబాబుకు ఏదో ఒక పదవి ఇవ్వాలనుకున్నారో ఏమో తెలీదు కానీ.. అంబటిని గుంటూరు వెస్ట్‌కు ఇంచార్జ్‌గా వేసేశారు. అయితే ఈ నియోజకవర్గం ఇంచార్జ్‌గా అంబటిని నియమించారని తెలిసిన తర్వాత అంబటిని పరిస్థితిని చూసి నవ్వుకునేవాళ్లు వైసీపీలో ఎక్కువైపోయారు. అసలే గుంటూరు వెస్ట్‌ వైసీపీకి కొరుకుడు పడని నియోజకవర్గం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ రాజకీయం చేయాలంటే భారీగా డబ్బుతో కూడుకున్న పరిస్థితి. ఖజానా ఖరుసైపోతుందని, ఓడినప్పటి నుండి పట్టుమని పది మంది కార్యకర్తల్ని కూడా మెయింటైన్‌ చేయని అంబటి… గుంటూరు వెస్ట్‌లో నెగ్గుకు రాగలరా? ఇప్పుడు డబ్బు బయటకు తీయక తప్పదా? ఖర్చుపెట్టినా ఫలితం ఉంటుందా? ఇది అంబటికి పదవి ఇవ్వడమా? పనిష్మెంటా? అంటూ జిల్లా వైసీపీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *