Vamsi with Babu: కూటమి 164 సీట్లతో అజేయ విక్టరీతో అధికారంలోకి వచ్చినప్పటికీ.. ఆనాటికి పాలన గాడిలో పెట్టడం అంటే అంత సులభం కాదనే విధంగానే పరిస్థితులుండేవి. అప్పుల పాలైన రాష్ట్రం, గాడి తప్పిన వ్యవస్థలు, అవినీతి ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వం, ప్రశ్నించేవారి గొంతు కొక్కడం, గజినీల పాలన నుండి విముక్తి కోసం, స్వేచ్ఛ కోసం ప్రజలు ఎదురుచూస్తున్న పరిస్థితులు, ఎన్నో సమస్యలు స్వాగతం పలుకుతుండగా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు చంద్రబాబు. మరి కూటమి ఏడాది పాలనలో సమస్యలని అధిగమించారా? అంటే.. ఇది సుపరిపాలనలో తొలి అడుగే అన్నారు సీఎం చంద్రబాబు.
పార్టీ పగ్గాలు లోకేష్‌కి ఎప్పుడు అప్పగిస్తారు? నాయకులంతా కోరుకుంటున్నా ఎందుకు ఆగారు? అన్న ప్రశ్నకు టీడీపీ అంతర్గత ప్రజాస్వామ్యంతో పనిచేసే పార్టీ అని, ఏదైనా పార్టీ నియమావళి ప్రకారమే జరుగుతుందని బదులిచ్చారు టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
ఇక రెడ్‌బుక్ రాజ్యాంగం అంటూ వైసీపీ నేతలు లోకేష్ టార్గెట్‌గా చేస్తున్న విమర్శలకు చంద్రబాబు ధీటుగా స్పందించారు.
అమరావతిపై జరుగుతోన్న విషప్రచారం, ముఖ్యంగా అమరావతి మహిళలపై చేసిన అసభ్య వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించకూడదు అన్న ఆయన మాటలను బట్టి చూస్తే.. చాలా సీరియస్‌గానే చర్యలు ఉండబోతున్నాయని అర్థమౌతోంది.
2029లో మళ్లీ నేనే సీఎం అంటున్న జగన్ వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించిన చంద్రబాబు.. అది ఎంత ప్రమాదకరమో వివరిస్తూనే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైకుంఠపాళిని చేయొద్దంటూ ప్రజలకు విజ్ఙప్తి చేశారు.
ఇక లిక్కర్ స్కామ్‌లో అంతిమ లబ్ధిదారుడు జగనే అని ఆరోపణలొస్తున్న నేపథ్యంలో జగన్ అరెస్ట్ అయ్యే చాన్స్ ఉందా? అయితే ఎప్పుడు? సీఎం ఆలోచనేంటి? ఆచరణ ఎలా ఉండబోతోంది? మీరే చూడండి.