Hyderabad: తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. సమగ్ర కుటుంబ సర్వే, కులగణన చేపట్టడానికి కాంగ్రెస్ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 6 నుంచి సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు సమాచారం. 54 అంశాలతో ఫార్మాట్ నిర్వహించి..60 రోజుల్లో నివేదిక తీసుకోనున్నారు.సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన చేయనున్నారు.
54 ప్రశ్నలతో కూడిన ఏడు పేజీలతో నమూనా సిద్ధం చేశారు.15 రోజులపాటు క్షేత్రస్థాయిలో సిబ్బంది సర్వే చేయనున్నారు. తెలంగాణలో 3.80 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. 1.10 కోట్ల కుటుంబాలపై అధికారులు సర్వే చేయనున్నారు. ప్రతీ 150 కుటుంబాలకు ఓ సర్వే గణకుడిని నియమించనున్నారు. సర్వే కోసం మొత్తం 75 వేల మంది సిబ్బంది అవసరమని మరో 15 వేల మంది పర్యవేక్షకులు అవసరంమని అంచనా వేస్తున్నారు.
2014లో ప్రత్యేక తెలంగాణ వచ్చిన కొత్తలో సమగ్ర కుటుంబ సర్వేను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించింది. తెలంగాణ వ్యాప్తంగా ఒకే ఒక్కరోజులో సర్వే పూర్తి చేసిన ఆ లెక్క విషయాలు అప్పటి ప్రభుత్వం ఆహర్గటం చేయలేదు.