Hyderabad: ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న మిస్ వరల్డ్ 2025 అంతర్జాతీయ సుందరాంగనల పోటీలు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా సాగుతున్నాయి. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ ఈ ప్రపంచస్థాయి పోటీకి వేదికగా మారింది. వివిధ దేశాల నుంచి వచ్చిన అందగత్తెలు గౌరవ కిరీటం కోసం పోటీ పడుతున్నారు.
ఈ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన నందిని గుప్తా మంచి ప్రదర్శన, l ప్రస్థానం టాప్-8 దశకు ముందే ముగిసింది. తొలుత ప్రకటించిన టాప్-8 జాబితాలో నందినికి స్థానం దక్కలేదు, ఇది భారత అభిమానులను కొంత నిరాశకు గురిచేసింది.
టాప్-8 లోకి ఎంపికైన దేశాలు:
మార్టినిక్
బ్రెజిల్
ఇథియోపియా
నమీబియా
పోలెండ్
ఉక్రెయిన్
ఫిలిప్పీన్స్
థాయ్‌లాండ్
ఈ సుందరీమణుల్లో నుంచి ఖండాల వారీగా ఒక్కొక్కరు ఫైనల్ నాలుగు స్థానాలకు ఎంపికయ్యారు:
అమెరికా & కరీబియన్: మార్టినిక్
ఆఫ్రికా: ఇథియోపియా
యూరప్: పోలెండ్
ఆసియా: థాయ్‌లాండ్
ఖండాల వారీగా ఎంపికైన ఈ టాప్-4 అందగత్తెలతో న్యాయనిర్ణేతలు ప్రశ్నల రౌండ్ నిర్వహిస్తున్నారు. వారు ప్రదర్శించే తెలివితేటలు, సమాధానాల ఆధారంగా చివరి విజేతను ఎంపిక చేయనున్నారు.
ఈ పోటీలు భారత్‌లో నిర్వహించడమే ఒక గర్వకారణమని, భారత్‌కు మరోసారి గ్లోబల్ ఫ్యాషన్ రంగంలో ప్రాధాన్యత పెరిగిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.