Vicky Kaushal

Vicky Kaushal: మరో లెజెండ్ బయోపిక్‌ లో విక్కీ కౌశల్?

Vicky Kaushal: సినీ చరిత్రలో అమరస్థాయి సాధించిన దిగ్గజ దర్శకుడు గురుదత్ 100వ జయంతి వేడుకలు సమీపిస్తున్నాయి. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ గురుదత్ జీవిత కథను తెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నాడు. అల్ట్రా మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్ గ్రూప్, గురుదత్ ఫిల్మోగ్రఫీ హక్కులతో ఈ బయోపిక్‌ను రూపొందిస్తోంది.

‘యూరి’, ‘చావా’ వంటి బ్లాక్‌బస్టర్‌లతో మెప్పించిన విక్కీ, ఈ పాత్ర కోసం సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నాడు. అభిమానులు ఈ చిత్రం గురుదత్ వారసత్వానికి న్యాయం చేస్తుందని ఆశిస్తున్నారు.

Also Read: Sreeleela: శ్రీలీల ఎంగేజ్‌మెంట్‌ సంచలనం: నిజమా.. సినిమా స్టంటా?

Vicky Kaushal: ఈ ఏడాది మేలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ప్యాసా’, ‘కాగజ్ కే ఫూల్’, ‘చౌద్విన్ కా చంద్’, ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’ వంటి గురుదత్ క్లాసిక్‌ల 4K వెర్షన్‌లు ప్రదర్శితమయ్యాయి. జులై 9న గురుదత్ శతజయంతి సందర్భంగా, ఈ చిత్రాలను భారతదేశంలోని థియేటర్లలో మళ్లీ విడుదల చేయనున్నారు. వారం రోజుల నివాళి కార్యక్రమంతో గురుదత్ సినీ ప్రస్థానాన్ని ఘనంగా జరుపనున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *