Coriander Health Benefits: కొత్తిమీర గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఏదైనా డిష్ డిఫరెంట్ గా ఉండాలంటే చివర్లో కొత్తిమీర వేయాల్సిందే. కొత్తిమీరను అనేక రకాల వంటకాలను తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. కొత్తిమీర రుచికరమైనది మాత్రమే కాదు ఆరోగ్యకరమైనది కూడా. అనేక అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.
ఇది కూడా చదవండి: Health Tips: తొక్కే కాదా అని తీసిపారేయకండి!
కొత్తిమీర ద్వారా కొన్ని రకాల సమస్యలను సులభంగా నియంత్రించవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. తద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొత్తిమీర తినడం లేదా కొత్తిమీర రసం తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ విధంగా మీరు త్వరగా వ్యాధుల నుండి బయటపడవచ్చు.
ఇది కూడా చదవండి: Periods: ప్రెగ్నెంట్ కాకపోయినా పీరియడ్స్ ఆలస్యం అవుతుందా? కారణాలు ఇవే
కొత్తిమీర తలనొప్పి, వికారం, అపానవాయువు నోటి దుర్వాసన వంటి సమస్యలను కూడా నియంత్రిస్తుంది. కొత్తిమీర రసాన్ని తలకు పట్టించి మర్దన చేస్తే తలనొప్పి క్షణాల్లో మాయమవుతుంది. కొత్తిమీర పేస్ట్ లేదా కొత్తిమీర రసాన్ని ముఖానికి రాసుకుంటే ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గి చర్మం మెరుస్తుంది. కొత్తిమీర రసం తాగడం వల్ల చర్మానికి తేమ అందుతుంది. జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి.