Google KK Doodle: ప్రముఖ గాయకుడు కెకెకి నివాళిగా గూగుల్ ఓ డూడుల్ ని రిలీజ్ చేసింది. కెకెగా ప్రసిధ్దుడైన కృష్ణకుమార్ కున్నత్ 1996, అక్టోబర్25న ‘మాచిస్’లో ‘ఛోడ్ ఆయీ హమ్’ అనే పాటతో తన సింగింగ్ కెరీర్ ను ప్రారంభించాడు. ఆ తర్వాత పలు సూపర్ హిట్ పాటలతో శ్రోతలను ఎంతగానో అలరించాడు. 1968, ఆగస్ట్ 23న ఢిల్లీలో పుట్టిన కెకె 1994లో జింగిల్స్ సమకూర్చటం మొదలు పెట్టి ఆ తర్వాత ప్లేబాక్ సింగర్ గా మారాడు. 1999లో తన తొలి ఆల్బమ్ ‘ఫల్’ ను రిలీజ్ చేశాడు.
Google KK Doodle: తన 30 సంవత్సరాల కెరీర్లో 3,500 జింగిల్స్ కంపోజ్ చేసిన కెకె, 11 భాషల్లో పాటలు పాడాడు. హిందీలో 500 పాటలకు పైగా పాడిన కెకె ప్రాంతీయ భాషల్లో 200 పాటలకు పైగా పాడటం విశేషం. 2022లో 53 ఏళ్ళ వయసులో కలకత్తాలో మరణించారు కెకె. తెలుగులో ‘ప్రేమదేశం’లో కాలేజ్ స్టైలే, హలో డాక్టర్ పాటలు, ‘ఖుషీ’లో యే మేరా జహా, ‘సంతోషం’లో ‘దేవుడే దిగి వచ్చినా, ‘నువ్వే నువ్వే’లో ఐ యావ్ వెరీ సారీ, ‘ఆర్య’లో ఫీల్ మై లవ్, ‘శంకర్ దాదా ఎంబిబియస్’లో చైల చైలా, ‘నా ఆటోగ్రాఫ్’లో గుర్తుకొస్తున్నాయి, ‘అతడు’లో అవును నిజం తో పాటు ‘మనసంతా నువ్వే, నువ్వు నేను, స్టూడెంట్ నెంబర్ వన్, వాసు, హోలి, జయం, నీ స్నేహం, దిల్, మల్లీశ్వరి, గుడుంబాశంకర్, ఆర్య2, డార్లింగ్, ఎవడు వంటి పలు చిత్రాల్లో పాటలు పాడాడు కెకె.