Swiss Indoors Basel 2024: బాసెల్ లో జరుగుతున్న స్విస్ ఇండోర్స్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ -అల్బానో ఒలివెట్టి జోడీ కథ ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ–ఒలివెట్టి ద్వయం 6–4, 5–7, 6–10తో జేమీ ముర్రే–జాన్ పీర్స్ జంట చేతిలో పోరాడి ఓడింది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన యూకీ–ఒలివెట్టి జోడీకి 19,765 యూరోలు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.18 లక్షల ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తొలి రౌండ్‌లో ఏడు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ నెగ్గిన జీన్ జూలియన్ రోజర్ – జో సాలిస్‌బరీ జంటను బోల్తా కొట్టించిన యూకీ–ఒలివెట్టి ద్వయం క్వార్టర్ ఫైనల్లో మరో సంచలనం సృష్టించే అవకాశాన్ని చేజార్చుకుంది.
