ANR National Award 2024 : అమితాబ్ చేతుల మీదుగా చిరుకు ఎఎన్ఆర్ అవార్డ్!

ANR National Award 2024 : అమితాబ్ చేతుల మీదుగా చిరుకు ఎఎన్ఆర్ అవార్డ్!

ANR National Award 2024 : ఈ ఏడాది అక్కినేని జాతీయ అవార్డును చిరంజీవికి ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసినదే. ఈ ఏడాది లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి కావటం విశేషం. ఇటీవల అక్కినేని పోస్టల్ స్టాంప్ ను కూడా విడుదల చేసింది భారతప్రభుత్వం. ఇండియన్ సినిమాకు ఎనలేని సేవ చేసినందుకు గానూ ఈ నెల 28న బిగ్ బి అమితాబ్ చేతుల మీదుగా ఈ అవార్డును చిరంజీవికి అందచేయనున్నారు. నాగార్జున చిరంజీవిని వ్యక్తిగతంగా కలసి అక్కినేని అవార్డును స్వీకరించటానికి ఆహ్వానించారు. ‘అక్కినేని శతజయంతి సందర్భంగా పద్మవిభూషణ్ అమితాబ్ చేతుల మీదుగా పద్మభూషణ్ చిరంజీవిని అక్కినేని జాతీయ అవార్డ్ తో సత్కరించుకోవటం ఆనందంగా ఉంది’ అని ట్వీట్ చేశారు నాగార్జున. ప్రతిష్టాత్మక అక్కినేని జాతీయ అవార్డును ఇప్పటి వరకూ దేవానంద్, షబానా ఆజ్మీ, అంజలీదేవి, వైజయంతీమాల, లతామంగేష్కర్, కె. బాలచందర్, హేమమాలిని, శ్యామ్ బెనెగల్, అమితాబ్ బచ్చన్, రాజమౌళి, శ్రీదేవి, రేఖకు అందచేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Delhi Elections: ఢిల్లీ ఎన్నిక‌ల్లో ఆప్ ఓట‌మిపై ప్ర‌ముఖుల స్పంద‌న‌లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *