Good Bad Ugly: తమిళ స్టార్ హీరో అజిత్ ఇప్పుడు రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ మగిళ్ తిరుమేని దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘విడా ముయర్చి’ అందులో ఒకటి కాగా, మరొకటి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్నాడు. దీపావళికి రావాల్సిన ‘విడా ముయర్చి’ షూటింగ్ లేటైంది. దాంతో దీనిని పొంగల్ కు రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలానే సంక్రాంతికి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ని విడుదల చేస్తామని పలు సార్లు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పేర్కొన్నా… దీనిని షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. ప్రస్తుతం దీని షూటింగ్ స్పెయిన్ లో జరుగుతోందని, ఆ తర్వాత బల్గేరియా, చెన్నయ్ లో జరిగే షెడ్యూల్స్ తో చిత్రీకరణ పూర్తవుతుందని చెబుతున్నారు. ఈ యేడాది డిసెంబర్ కు షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది. అయితే ఈ రెండు సినిమాలకు కనీసం మూడు నెలల గ్యాప్ ఉండాలనే ఉద్దేశ్యంతో ‘విడా ముయర్చి’ని జనవరిలో, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ని ఏప్రిల్ లోనూ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారట.
