Harihara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు’ వాయిదాల మోతతో సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత మార్చి 28 నుంచి మే 9కి వాయిదా పడిన ఈ చిత్రం, మళ్లీ మే చివరికి జరిగే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ డేట్స్ లభ్యత లేకపోవడంతో బాలన్స్ షూటింగ్ ఇంకా పెండింగ్‌లో ఉంది, ఇది వాయిదాకు ప్రధాన కారణంగా చెప్పబడుతోంది.
Also Read: SSMB29కి బిగ్ బ్రేక్!
Harihara Veeramallu: ఈ వాయిదా పరంపర విజయ్ దేవరకొండ భారీ చిత్రం ‘కింగ్డమ్’పై ప్రభావం చూపుతోందని రూమర్స్ షికారు చేస్తున్నాయి. ‘హరిహర వీరమల్లు’ మే చివరికి ఫిక్స్ అయితే, ‘కింగ్డమ్’ విడుదల కూడా వాయిదా పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ‘కింగ్డమ్’ ఫేట్ పవన్ చిత్రంపై ఆధారపడినట్లు తెలుస్తోంది. ఈ వాయిదాల నేపథ్యంలో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ‘హరిహర వీరమల్లు’ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

