Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం కొత్త చిత్రంతో బిజీగా ఉన్నాడు. దర్శకుడు మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో రూపొందుతున్న హారర్-కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ (టెంపరరీ టైటిల్) షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ సినిమా పూర్తి కాకముందే, వరుణ్ తేజ్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. తాజాగా, దర్శకుడు రాధాకృష్ణ వరుణ్ తేజ్‌కు ఓ ఆసక్తికర కథను వినిపించినట్లు సమాచారం. గతంలో ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని తెరకెక్కించి నిరాశపరిచిన రాధాకృష్ణ, ఆ తర్వాత గోపీచంద్‌తో ప్రాజెక్ట్ ప్లాన్ చేసినా అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు వరుణ్ తేజ్‌తో కొత్త సినిమా చేసేందుకు రాధాకృష్ణ ఆసక్తి చూపిస్తున్నాడు. వరుణ్ ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అభిమానులు వరుణ్ నెక్స్ట్ మూవీ అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఈ కాంబో సెట్ అవుతుందా? వేచి చూడాలి!
