120 Bahadur: దర్శకనిర్మాత ఫర్హాన్ ఆక్తర్ ముఖ్య పాత్ర పోషిస్తున్న తాజా చిత్రం ‘120 బహాదూర్’. 1962లో జరిగిన ఇండో చైనా వార్ లో రెజాంగ్ లా యుద్ధానికి నాయకత్వం వహించిన మేజర్ షైతాన్ సింగ్ భాటి జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి రజనీశ్ ఘాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారంకు ఈ రెజాంగ్ లా వార్ 62 ఇయర్స్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వీర సైనికులకు నివాళులు అర్పిస్తూ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. వేలాది శత్రుసైనికులకు వ్యతిరేకంగా నిలిచి కేవలం 120 సైనికులు యుద్ధం చేసిన రోజు 1962 నవంబర్ 18. చివరి శ్వాస వరకూ వార్ ఫీల్డ్ లో నిలిచి ధైర్యంగా పోరాడిన వీర సైనికుల కథ ఇది. వారి పరాక్రమంతో మన దేశాన్ని రక్షించటం కోసం ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారతీయ సైనికులు చరిత్రలో నిలచిపోతారని, అలాంటి దేశ రక్షకుల పరాక్రమాన్ని చూసేందుకు సిద్దంగా ఉండండి అని యూనిట్ చెబుతోంది. మేజర్ షైతాన్ సింగ్ గా ఫర్హాన్ ఆక్తర్ నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. దీనిని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
