Trivikram Srinivas: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి కొత్త సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది కాలంగా ఆయన డైరెక్షన్‌లో సినిమా రాలేదు. త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో చేయాలని ప్లాన్ చేశాడు. కానీ, బన్నీ ప్రస్తుతం దర్శకుడు అట్లీతో ఓ చిత్రంలో బిజీగా ఉండటంతో త్రివిక్రమ్‌కు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.ఈ గ్యాప్‌లో త్రివిక్రమ్ కొత్త ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేయాలని నిర్ణయించాడు. విక్టరీ వెంకటేష్‌తో గతంలో అనౌన్స్ చేసిన సినిమాను ఇప్పుడు పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఈ సినిమాలకు త్రివిక్రమ్ మాటలు రాశారు. ఇప్పుడు మళ్లీ ఈ జోడీ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతోంది. అభిమానులు ఈ కాంబో నుంచి మరో సూపర్ హిట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు షురూ అవుతుందో చూడాలి!
