ED Rides: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో సోమవారం ఉదయం నుంచి ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లోని ఇండ్లలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. భూదాన్ భూములు, మహేశ్వరం భూముల వ్యవహారంలో పలువురి ఇండ్లలో ఈ తనిఖీలు చేపడుతున్నట్టు తెలుస్తున్నది.
ED Rides: హైదరాబాద పాతబస్తీకి చెందిన ప్రముఖ వ్యాపారి ఫర్పోన్ ఖాన్, మున్వర్‌ఖాన్, ఖదీరున్నీస్ నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫర్పోన్ ఖాన్ హైదరాబాద్ నగరంలో ప్రముఖ వ్యాపారిగా కొనసాగుతున్నారు. ఆయనకు నగరంలో పలుచోట్ల భారీ షోరూములు ఉన్నాయి. మహేశ్వరం పరిధిలో వంద ఎకరాల భూమిని కబ్జా చేశారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి.
ED Rides: ఈ మేరకే వారిండ్లతోపాటు వారి కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇదే వ్యవహారంలో ఇప్పటికే మాజీ ఐఏఎస్ అమోయ్‌కుమార్‌ను ఈడీ విచారించింది. వివిధ ఆధారాలను ఇప్పటికే సేకరించిన ఈడీ అధికారులు ఈ తనిఖీలు చేపడుతున్నట్టు సమాచారం. దీంతో నగరంలో వివిధ చోట్ల భూముల కబ్జాలకు పాల్పడిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.