L2 Empuran

L2 Empuran: స్ట్రీమింగ్‌కు వచ్చేసిన ‘ఎల్2 ఎంపురాన్’!

L2 Empuran: మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, విలక్షణ నటుడు-దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘ఎల్2 ఎంపురాన్’ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ‘లూసిఫర్’ సీక్వెల్‌గా విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో సంచలన విజయం సాధించింది.

ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోనూ అలరిస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో ‘ఎల్2 ఎంపురాన్’ మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
పృథ్వీరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో టోవినో థామస్, మంజు వారియర్, అభిమన్యు సింగ్ కీలక పాత్రల్లో నటించారు.

Also Read: Hit-3: యూఎస్ ప్రీమియర్స్‌లో దుమ్మురేపుతున్న ‘హిట్-3’!

L2 Empuran: దీపక్ దేవ్ సంగీతం సమకూర్చగా, ఆశీర్వాద్ సినిమాస్, లైకా ప్రొడక్షన్స్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. హై-ఓక్టేన్ యాక్షన్, గ్రిప్పింగ్ స్టోరీలైన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ భారీ ఆదరణ పొందుతోంది. మోహన్‌లాల్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులందరికీ ఈ మూవీ ఓ విజువల్ ట్రీట్‌గా నిలుస్తోంది.

L2 ఎంపురాన్ ట్రైలర్ :

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  KTR: దమ్ముంటే మేడిగడ్డ మీదకే రా... చర్చ పెట్టుదాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *