High Court: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇటీవలే అమలులోకి తెచ్చిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర హైకోర్టులో ఓ మహిళ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులను జారీ చేసింది. గతంలో వేరే కోర్టుల తీర్పులను ఉదహరిస్తూ ఆ పిటిషన్‌లో పేర్కొనడం గమనార్హం.
High Court: ప్రైవేటు రంగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన ఎస్సీ వర్గానికి చెందిన కనుకుంట్ల మంగ రాష్ట్ర హైకోర్టులో ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై తాత్కాలిక ప్రధాన జడ్జి ఆకాశ్‌కుమార్ ఎదుట వాదనలు వినిపించారు. దావీందర్‌సింగ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ చట్టం విరుద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు.
High Court: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ ఉండాలని సుప్రీంకోర్టు ఆనాడు స్పష్టంగా తీర్పును ఇచ్చిందని తన పిటిషన్లో గుర్తుచేశారు. అందుకే ఈ చట్టాన్ని నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. క్రీమీలేయర్ ఉండాలని ఏకసభ్య కమిషన్ సిఫారసు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తుచేశారు. ఈ ఎస్సీ వర్గీకరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు.