Bengaluru: బెంగళూరులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఓం ప్రకాశ్ (68) హత్యకు గురయ్యారు. ఈ ఘటన నగరంలోని HSR లేఔట్ ప్రాంతంలో ఉన్న ఆయన నివాసంలో జరిగింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఓం ప్రకాశ్ భార్య పల్లవి పైనే పోలీసులకు అనుమానాలు ఉన్నాయి. ఘటన జరిగిన వెంటనే ఆమెతో పాటు వారి కుమార్తెను కూడా పోలీసులు విచారిస్తున్నారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు దారి తీసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఓం ప్రకాశ్ నిబంధనల ప్రకారం పదవీవిరమణ చేసిన తరువాత బెంగళూరులో నివాసం ఉంటున్నారు. ఆయన నిజాయతీగల పోలీస్ అధికారి అనే పేరు సంపాదించారు. ఈ ఘటనతో ఆయన మృతి పట్ల పోలీస్ వర్గాలు, మిత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పోలీసులు కేసును అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. పూర్తి సమాచారం కోసం దర్యాప్తు కొనసాగుతోంది.